Vote For | అభివృద్ధికి పట్టం కట్టండి

Vote For | అభివృద్ధికి పట్టం కట్టండి

  • రాయికల్ పంచాయతీని అభివృద్ధిలోకి తీసుకొస్తా
  • సర్పంచి అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్

Vote For | షాద్ నగర్, ఆంధ్ర‌ప్ర‌భ : అభివృద్ధికి పట్టం కట్టండి.. రాయికల్ గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని రాయికల్ సర్పంచ్ అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్ అన్నారు. రాయికల్(Raikal) ప్రజలు త‌న‌ను ఆదరించి.. అభిమానించి.. మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు పరిశ్రమల్లో గ్రామాల యువకులకు ఉద్యోగ అవకాశాలు(Job Opportunities) కల్పిస్తానన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి యువతకు అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలకు కోరారు. గ్రామంలో మౌలిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు(Better services) అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

Leave a Reply