Vivek Venkataswamy | ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించం

Vivek Venkataswamy | ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించం

మంత్రి వివేక్ వెంకటస్వామి


Vivek Venkataswamy | మంచిర్యాల చెన్నూర్, ఆంధ్రప్రభ : ఇసుక అక్రమ రవాణా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) హెచ్చరించారు. చెన్నూరు మండలం కిష్టంపేట సమీపంలో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్యాండ్ బజార్ ను మంత్రి వివేక్ ఈరోజు ప్రారభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… స్థానిక ప్రజల అవసరాలకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక బజార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయంలో ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ దందా నడిపి, ప్రభుత్వ ఆదాయానికి ఎగనామం పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల హామీలో భాగంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీ ప్రకారం ఇసుక అక్రమదందాను నియంత్రించామన్నారు. కావాలనే కొంతమంది మంత్రి ఇలాఖాలో అక్రమ ఇసుక దందా నడుస్తున్నట్లు దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. మంత్రి పదవి ఇచ్చినాక మైనింగ్ లో ఖజానా తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంతరెడ్డి అన్నట్లు తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్నలు పొందుతుందన్నారు.

Leave a Reply