Virat Kohli in Vizag | అప్పన్న సన్నిధిలో..
- కొహ్లీ ప్రణామం
- ఆలయ మర్యాదలతో
- విరాట్ కు సత్కారం
Virat Kohli in Vizag | (ఆంధ్రప్రభ, సింహాచలం) : శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం ప్రముఖ క్రికెటర్ (Cricket) విరాట్ కోహ్లీ, ఆయన కుటుంబ సభ్యులు, ఆసియా కప్ టీమిండియా మాజీ మేనేజర్ పి. వెంకట రామ్ ప్రశాంత్, టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ఏసీఏ ప్రతినిధి విష్ణు దర్శించుకున్నారు. వీరిని దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వర్ రావు, పర్యవేక్షణ అధికారి కంచి మూర్తి స్వాగతించి. ముందుగా కప్పస్తంభం ఆలింగనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనం (Swami darshan) కల్పించారు. నాదస్వరాలతో, వేదఘోషల మధ్య వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున స్వామి శేష వస్త్రం అందజేసి సత్కరించారు. స్వామి చిత్ర పటం, ప్రసాదాలను వినయపూర్వకంగా అంచేశారు.









Also Read : Blind Champions : అందరూ అంధులే

