బీసీ బంద్ ర్యాలీలో వీహెచ్‌కు అస్వస్థత

బీసీ బంద్ ర్యాలీలో వీహెచ్‌కు అస్వస్థత

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వి.హ‌నుమంత‌రావు (VHanumanthaRao) (వీహెచ్‌) ర్యాలీ న‌డుస్తూ తూలి ప‌డ్డారు. రాష్ట్ర‌వ్యాప్త బంద్‌లో భాగంగా ఈ రోజు హైద‌రాబాద్‌లో బంద్ కొన‌సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ లో పాల్గొంటోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుతోపాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender), డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి అంబర్ పేట్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వీహెచ్ నడుస్తూ ఒక్కసారిగా తూలి ప‌డ్డారు. వెంటనే పక్కన ఉన్న నేతలు ఆయనను పైకి లేపారు. ఇటీవలే వీహెచ్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అస్వ‌స్థ‌త‌కు గురై తూలి ప‌డి ఉంటార‌ని ప‌లువురు భావిస్తున్నారు.

Leave a Reply