ఫుల్ మద్ది గ్రామంలో వర్మీ కంపోస్ట్

ఫుల్ మద్ది గ్రామంలో వర్మీ కంపోస్ట్
ఏర్పాటుపై అవగాహన
వికారాబాద్, ఆంధ్రప్రభ : స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీ నేతృతంలో వికారాబాద్ మండలం కులమద్ది గ్రామంలో పరిగి డిగ్రీ కళాశాల చెందిన విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీ మాట్లాడుతూ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో లభించే వర్మి కంపోస్టు ద్వారా ఎరువులను తయారు చేయడంలో విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో గల వర్మి కంపోస్ట్ తయారీ కేంద్రాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ మండలం పునుపతి గ్రామంలో పాటు పలు గ్రామాల్లో ఈ తయారీ కేంద్రాలు ఉన్నాయని విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఈ కార్యక్రమాన్ని అందించే పని అన్నారు. రాబోయే రోజుల్లో వర్మీ కంపోస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
