Venugopala Swamy Temple | ధనుర్మాస ఉత్సవాలు..

Venugopala Swamy Temple | ధనుర్మాస ఉత్సవాలు..
Venugopala Swamy Temple, హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం విష్ణు సహస్రనామార్చన, ఫల పుష్పాలతో గోదాష్టోత్తరము, రామానుజాష్టోత్తరములు, తిరుప్పావై శేవాకాలము, మంగళాశాసనము నిర్వహించారు. కోట సూర్య ప్రకాశరావు లక్ష్మీపార్వతి దంపతులచే శ్రీ ఆంజనేయ స్వామికి అష్టోత్తర శత కళశాభిశేకం, నాగవల్లి దలార్చన, కదళీ ఫలార్చన పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామి వారికి పల్లకి సేవ చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి, స్థానాచార్యులు శ్రీనివాసా చార్యులు, రామకృష్ణమా చార్యులు, జగన్నాధాచార్యులు, ఆలయ అర్చకులు నరగిరినాధుని రంగభట్రాచార్యులు, భాస్కరాచార్యులు, మురళీ కృష్ణమాచార్యులు, కోటా హరిప్రసాద్, వాసుదేవరావు, వెంకటేశ్వరావు, అశోక్, గుండా రమేశ్, రామిశెట్టి రాము, వెన్న పద్మ తిరపారెడ్డి, కిరణ్, బిక్షమ్ పశ్య పిచ్చమ్మ, పద్మ, భారతమ్మ భక్తులు పాల్గొన్నారు.
