Vemulawada | రాజన్న సన్నిధిలో కిక్కిరిసిన భక్తజనం
వేములవాడ దక్షిణ కాశి గా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్త జనంతో కిక్కిరిసింది. సెలవు దినం కావడంతో ఆదివారం స్వామివారిని సుమారు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ ,కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న సన్నిధికి తరలివచ్చారు.
తెల్లవారుజామున ధర్మగుండలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరారు.. శివరాత్రి పర్వదినం సమీస్తున్న సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
స్వామివారిని దర్శించుకున్న భక్తుల ద్వారా సుమారు 40 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇంచార్జీవో వినోద్ రెడ్డి ప్రకటనలు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.