Veldanda | అంజయ్య మృతి బాధాకరం…

Veldanda | అంజయ్య మృతి బాధాకరం…
- తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి..
Veldanda | వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల కేందంలోని రాఘయిపల్లి సర్పంచ్ సామ వెంకటయ్య తండ్రి అంజయ్య మృతి చెందడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనంతరం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వెంకటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీతో పాటు నాయకత్వం ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్డండా మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ (హైజాక్ )బీఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు నాగులు నాయక్, నాగుల శ్రీనివాస్, చౌధర్ పల్లి ఉప సర్పంచ్ రాజు, రాయికంటి గిరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
