వరదలో కొట్టుకుపోయిన వాహనాలు..

(హిమాచల్ ప్రదేశ్), సెప్టెంబర్ 16 (ఆంధ్రప్రభ వెబ్ డెస్క్): మండి(Mandi) జిల్లాలో కురిసిన భారీ వర్షాలు(Heavy rains) ధరమ్‌పూర్(Dharampur) పట్టణంలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. సోమవారం రాత్రి నుంచి నిరంతర వర్షం కారణంగా ధరమ్‌పూర్ బస్టాండ్ వరద నీటితో నిండిపోయింది. సోన్ ఖద్ నది(Son Khad River) ఉప్పొంగి, అర్ధరాత్రి వరద నీరు బస్టాండ్‌లోకి చొచ్చుకొని, రాష్ట్ర రవాణా బస్సులు, కార్లు, బైక్‌లు, స్కూటర్ల, ఇతర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఎటుంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఒక వ్యక్తి మిస్సింగ్ అయినట్లు పోలీసులు తెలిపారు.
నీటిలో మునిగిన హాస్టల్
వర్షాలకు అనేక ఇళ్లు, దుకాణాల్లో శిథిలాలు చేరాయి. సోన్ ఖద్ నదీ తీరంలోని ఇళ్లు(houses), దుకాణాలు(shops) మునిగిపోగా, నివాసితులు పైకప్పులపైకి చేరారు. 150 మంది విద్యార్థులున్న(students) హాస్టల్ కూడా నీటిలో మునిగిపోయింది. దీంతో విద్యార్థులు అంతస్తుపైకి వెళ్లారు. డీఎస్పీ సంజీవ్ సూద్(DSP Sanjeev Sood) నేతృత్వంలో రక్షణ కార్యకలాపాలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో జూన్ 20 నుంచి రుతుపవన విధ్వంసంతో 404 మరణాలు(deaths) సంభవించినట్లు డీఎస్పీ వెల్లడించారు. కాగ అందులో 229 వర్ష సంబంధిత సంఘటనలు, 175 రోడ్డు ప్రమాదాల(Road accidents) వల్ల సంభవించాయి. మండిలో 37 వర్ష సంబంధిత మరణాలు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు.
