Vehicle Checking | డ్రోన్ కెమెరాలతో చర్యలు – సిఐ నాగరాజు

Vehicle Checking | డ్రోన్ కెమెరాలతో చర్యలు – సిఐ నాగరాజు

Vehicle Checking | చిట్యాల, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ సందర్భంగా చిట్యాల మండల పరిధిలో జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 హైదరాబాద్ వైపు నుండి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నల్లగొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్చంద్ర పవార్ సూచనల మేరకు నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్, డి.ఎస్.పి శ్రీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో ట్రాఫిక్ ను నిరంతరం పర్యావేక్షిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందికి తగిన సూచనలు చేస్తూ ట్రాఫిక్ జామ్ జరగకుండా బందోబస్తు, చిట్యాల, నార్కపల్లి సిఐ కె నాగరాజు ఎస్సై మామిడి రవికుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ అంతరాయం లేకుండా రాకపోకలు జరుగుతున్నాయని సీఐ నాగరాజు తెలిపారు. పెద్ద కాపర్తి, చిట్యాల చెక్‌పోస్టుల‌లో ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగినా, ఇతర ప్రమాదాలు జరిగినా, వాహనాలు మరే ఇతర కారణాలతో ఆగినా క్లియర్ చేస్తూ, వెంటనే అందుబాటులో ఉండి 24/7 విధులు నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు.

Vehicle Checking

Leave a Reply