తిరుమలలో వసంతోత్సవాలు..

తిరుమలలో వసంతోత్సవాలు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరుమలలో నేటి నుంచి వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి శ్రీ మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగించి.. ఆతర్వాత వసంతోత్సవ మండపానికి తీసుకువస్తారు. ఆతర్వాత అభిషేక నివేదనల అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 31న శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు రథాన్ని అథిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవం నిర్వహిస్తారు.
1న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు వసంతోవ్సవాల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్బంగా మూడు రోజుల పాటు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది.
