రామాయణం అందించిన మహర్షి

రామాయణం అందించిన మహర్షి
మక్తల్, ఆంధ్రప్రభ : రామాయణ గ్రంథ సృష్టికర్త వాల్మీకి మహర్షి (Valmiki Maharshi) జయంతి వేడుకల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఘనంగా ఆరాధనోత్సవాలు నిర్వహించారు. మంగళవారం ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం ఆవరణలో వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… రామాయణ మహాగ్రంథాన్ని (Ramayana Mahagrantham) అందించిన ఆదికవి వాల్మీకి మహర్షి మానవ జీవన విధానాన్ని నేర్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ సక్షేమ సంఘం నాయకులు పెద్ద బోయ నర్సిములు,హనుమంతు ,చిన్న కొండయ్య, బోయ రవికుమార్, బి.ఆంజనేయులు సూర్య, బి.శ్రీనివాసులు, చిన్న వెంకటేష్, చిన్న కురుమయ్య, కత్తెపల్లి రాములు, బి. కురుమయ్య, బి.గోపాలం, బోయ నరసింహ, శ్యామయ్య, గుడిసె ఆంజనేయులు, బోయ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
