బ్లాక్ బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘మ్యాడ్’ సినిమాలో తనదైన శైలిలో హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందు అందించబోతున్నాడు.
అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గాని పెళ్లి’, ‘స్వాతిరెడ్డి’ పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ విడుదలైంది.
‘మ్యాడ్’ సినిమాలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు.. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో వారి అల్లరి, పంచ్ డైలాగ్ లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ వేసవికి ‘మ్యాడ్ స్క్వేర్’, ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్ తో స్పష్టమైంది.
ఇక మ్యాడ్ స్క్వేర్ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ బ్యానర్‌లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తుండగా… ఈ సినిమా మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.