Vajpayee | పేర్ని నాని డైరెక్షన్ లో.. బీజేపీ నేతలు

Vajpayee | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి పేర్ని నాని డైరెక్షన్ లో బీజేపీ నేతలు నడుస్తున్నారని మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ దిలీప్ కుమార్ అన్నారు. సోమవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. వాజ్ పేయి(Vajpayee) విగ్రహ స్థాపన పేరుతో పేర్ని నాని రాజకీయాలు చేస్తున్నారని, ఎంతో ఉన్నతమైన వాజ్ పేయిని రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ గా ఉన్న హౌసింగ్ బోర్డ్ రింగ్ లో వాజ్ పేయి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు..? ప్రశ్నించారు. 2014-19 లోనే ఈ సెంటర్ ను ఎన్టీఆర్ సర్కిల్(NTR Circle) గా అభివృద్ధి చేయాలని తీర్మానం ఉందన్నారు. అలాంటప్పుడు ఇక్కడ వాజ్ పేయి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు..!? అని ప్రశ్నించారు. కేవలం కొంత మంది బీజేపీ నేతలు పేర్ని నానితో కుమ్మక్కై వివాదం చేస్తున్నారన్నారని తెలిపారు.
