పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

వికారాబాద్, ఆంధ్రప్రభ : గాలికుంటు వ్యాధి నివారణ ప్రచార వాహనంతో రైతులలో చైతన్యం మరియు అవగాహన వస్తుందని కొడంగల్ పశువైద్యాధికారి డాక్టర్ పరమేష్ తెలిపారు. ఈరోజు గాలికుంటు వ్యాధి నిర్మూలన ప్రచార వాహనం కొడంగల్ మండలంలోని రుద్రారం దౌల్తాబాద్ హస్నాబాద్ గ్రామాల్లో తిరిగి టీకాలు వేసే గ్రామాలలో ఈ వాహనం తిరగడం వలన రైతులకు గాలికుంటు వ్యాధి నివారణ అవశక్త తెలుస్తుందని తెలిపారు.

ప్రచార వాహన ఇంచార్జ్ హాజీ ఇబ్రహీం మాట్లాడుతూ నెల రోజులు ఈ వాహనం జిల్లా లోని 20 మండలాల అన్ని గ్రామాలు తిరుగుతూ పశువులు కలిగిన రైతులకు ఎఫ్ ఎం డి వ్యాధి యొక్క టీకాలు తీసుకుంటే లాభాలు తీసుకోకపోతే నష్టాల గురించి రైతులకు తెలియచేస్తున్నాం. అప్పుడు డిపార్ట్మెంట్ సిబ్బంది వచ్చి ప్రతి గ్రామంలో టీకాలు వేస్తున్నామని తెలిపారు.

Leave a Reply