Utkoor | విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం అవసరం

Utkoor | విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం అవసరం

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని కొత్తపల్లి సర్పంచ్ ఆర్.నర్సిములు, అన్నారు. శనివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతోనే సమాజం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రద్ధగా చదివించి వారికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలన్నారు. విద్యార్థులను చదువుతో పాటు వివిధ రంగాల్లో తీర్చిదిద్దాలన్నారు.

చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాలలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించి మౌలికల సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వడ్డించాలన్నారు. హెచ్ఎం రవీందర్ నాయక్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలు కనీస సామర్ధ్యాలు తెలుగులో ఆంగ్లంలో గణితంలో సాధించేందుకు తల్లిదండ్రులు తమ వంతు సహాయ సహకారం అందించాలని అన్నారు. బాల బాలికల తల్లిదండ్రులు ముఖ్యంగా రెండవ మూడవ తరగతి పిల్లలపై ప్రత్యేక దృష్టి ఎఫ్ ఎల్ ఎస్ సామర్ధ్యాలు చేరుకునేటట్లు తగిన ప్రణాళిక ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply