గో ఆరాధన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి

గో ఆరాధన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి
- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జాతీయస్థాయిలో చేప ట్టిన గో ఆరాధన ఉద్య మంలో అందరూ భాగ స్వాములై విజయవం తం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అఖిల భార త గో సమ్మాన్ అభి యాన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి రాజ్యాంగానుసారంగా అహింసా మార్గంలో గో సంరక్షణ కోసం ఆరాధ న కార్యక్రమాలను నిర్వ హిస్తున్నారన్నారు.
ప్రధానంగా దేశంలో సంపూర్ణ గోహత్య నివారణ చేయడం, గోవును దేశమాతగా ఆరాధ్యనీయ దేశదేవ తగా గుర్తించాలన్నారు. అలాగే గో పరిరక్షణ చట్టం, బోర్డును తీసు కురావాలని అన్నారు. వీటిని సాధించేందుకు ఈ నెల 27న జిల్లాలోని అన్ని తహశీల్దార్ కా ర్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తు న్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గో స మ్మాన్ అభియాన్ ప్రతి నిధులు అనిల్ గోపాల్, కుషాల్ దాస్, భూపాల్ సింగ్, వీహెచ్ పీ గో రక్ష విభాగం తెలంగాణ ప్రాంత కృషి ప్రముఖ్ ధాత్రిక రమేష్, ఇందూ రు గో సేవా సమితి అధ్యక్షుడు వీరమల్లి రమేష్, లక్ష్మీ కాంతం, యాదగిరి, రజినీకాంత్, వెంకటరమణ, పవన్ పాల్గొన్నారు.
