కనీవినీ ఎరుగని రీతిలో భక్తుల ఆగమనం

కనీవినీ ఎరుగని రీతిలో భక్తుల ఆగమనం

  • ఒకే రోజు 1.49 లక్షల మంది రాక‌
  • అంతటా ఆధ్యాత్మిక వాతావరణం
  • భ‌క్తుల‌కు సంతృప్తికర ఏర్పాట్లు
  • ఉచిత బ‌స్సుల ప్రభావంతో
  • పెద్ద సంఖ్యలో వ‌స్తున్నమ‌హిళా భ‌క్తులు…
  • సోమవారం రెండు ల‌క్షల మంది వ‌స్తార‌ని అంచ‌నా…
  • అందుకు త‌గిన‌ట్లుగా క‌ట్టుదిట్టమైన ఏర్పాట్లు..
  • సామాన్య భ‌క్తుల‌కే పెద్ద పీట
  • వీఐపీ ద‌ర్శనాల‌ను క‌ట్టడి చేస్తాం
  • ఆంధ్రప్రభ‌తో ఎంపీ కేశినేని శివ‌నాథ్‌

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కనీవినీ ఎరుగని రీతిలో క‌న‌క‌దుర్గమ్మ(Kanakadurgamma) దేవ‌స్థానంలో దేవీ శ‌ర‌న్నవ‌రాత్రులు అత్యద్భుతంగా, పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాద్(Kesineni Shivanad) అన్నారు. దుర్గమ్మ దర్శనార్థం ఇంద్రకీలాద్రికి చేరుతున్నభ‌క్తుల సంఖ్య పెరుగుతోంది.

ఇప్పటి వ‌ర‌కు అత్యధికంగా కాత్యాయ‌ని అమ్మవారి అలంక‌ర‌ణ రోజు 1.49 ల‌క్షల మంది భ‌క్తులు అమ్మవారిని దర్శనంతో పులకరిస్తున్నారని ఎంపీ శివనాథ్(MP Sivanad) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోమవారం మూలా న‌క్షత్రం రావ‌డంతో దాదాపు రెండు ల‌క్షల మంది భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నాం అందుకు త‌గిన విధంగా భ‌క్తుల‌కు అసౌఖ‌ర్యాలు క‌లుగ‌కుండా క‌ట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామ‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆంధ్రప్రభ‌(Andhra Prabha)తో జ‌రిగిన ముఖాముఖిలో వివ‌రించారు.

సోమవారం ముఖ్యమంత్రి సోమవారంముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స‌తీస‌మేతంగా హాజ‌ర‌వుతుండ‌టంతో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తకుండా ప‌గ‌డ్భందీగా ఏర్పాట్లు చేశామ‌ని వెల్లడించారు. క‌న‌క‌దుర్గమ్మఆల‌యం వ‌ద్ద ఏర్పాట్లపై ఆయ‌న ఆంధ్రప్రభ‌కు వివ‌రించిన వివ‌రాలు ఇలా… గ‌త ఏడాది బుడ‌మేరు విజ‌య‌వాడ న‌గ‌రాన్ని ముంచెత్తడంతో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ఆయా ప్రాంతాలు వ‌ర‌దలు, భారీ వ‌ర్షాల కార‌ణంతో ముంపుకు గుర‌య్యాయని, దీంతో గ‌త యేడాది భ‌క్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన‌లేక‌పోయారని ఎంపీ కేశినేని శివనాద్ వివరించారు.

అందుకే ఈ ఏడాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవీ శ‌ర‌న్నవ‌రాత్రుల‌ను ఘ‌నంగా నిర్వహించాల‌ని నిర్ణయించారని, ఉత్సవాలు ప్రారంభ‌మ‌య్యే 15 రోజులు ముందుగానే అధికారులు ఏర్పాట్లను అద్భుతంగా పూర్తిచేశారన్నారు. అమ్మవారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌స్తున్నభ‌క్తుల సంఖ్య రోజు రోజుకూ భారీగా పెరుగుతుందని, కాత్యాయ‌ని అమ్మవారు అలంక‌ర‌ణ రోజు 1.49 ల‌క్షల మంది భ‌క్తులు అమ్మవారిని ద‌ర్శించుకున్నట్లు తెలిపారు.

ఆ మ‌రుస‌టి రోజు 1.20 ల‌క్షలు భ‌క్తులు వ‌చ్చారని, ఇలా నిత్యం ల‌క్షలాది మంది భ‌క్తులు అమ్మవారిని ద‌ర్శించుకోవ‌డానికి త‌ర‌లివ‌స్తున్నాట్లు వివరించారు.ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు(free bus) క‌ల్పించ‌డంతో మ‌హిళా భ‌క్తులు ఆ ఆవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని, అమ్మవారిని ద‌ర్శించుకుని వారి కోరిక‌ల‌ను అమ్మవారికి విన్నివించుకుంటున్నారని చెప్పారు.

అమ్మవారిని ద‌ర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే భ‌క్తులు ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, పోలీసు శాఖ‌, క‌మాండ్ కంట్రోల్ రూం(police department, command control room) సిబ్భంది ఎప్పటిక‌పుడు ట్రాఫిక్‌(traffic)కు ఇబ్బందులు త‌లెత్తకుండా చూస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్న ప్రాంతాలలో వెంట‌నే వాహ‌నాల‌(vehicles)ను వేరే రూట్‌ల‌లోకి మ‌ళ్ళించి ట్రాఫిక్ స‌మ‌స్యను పరిష్కరిస్తున్నామన్నారు.

స్థానికంగా వీఐపీలు ఎవ‌రూ ద‌ర్శ‌నానికి వెళ్ళ‌డంలేదని,. ఒక వేళ వెళ్ళినా స్లాట్‌ల‌లోనె వెళుతున్నట్లు ఎంపీ కేసీనేని శివనాద్ తెలిపారు.. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌స్తున్న వీఐపీలు మాత్ర‌మె ఉంటున్నారని, గ‌తంలో కంటే ఇపుడు వీఐపీ ద‌ర్శ‌నాల‌ను చాలా వ‌ర‌కు క‌ట్ట‌డి చేశాం.

వారికి ప్ర‌త్యేక స‌మ‌యాల‌ను కేటాయించామన్న ఆయన ఉద‌యం 5 నుంచి 6, కేటాయించామన్నఆయనమ‌ధ్యాహ్నం 3 నుంచి 4, రాత్రి 7 నుంచి 8 గంట‌లలోపు ద‌ర్శ‌న స‌మ‌యాల‌ను కేటాయించినట్లు వివరించారు. స్లాట్లు(slots) లేకుండా ఎవ‌రినీ అనుమ‌తించ‌డంలేదని, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వీవీఐపీల విష‌యంలో ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం క‌ల్పించ‌క త‌ప్ప‌దన్నారు. అలాగే అమ్మ‌వారి ఆశీస్సులు అంద‌రికీ ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply