హోలీ సంబరాల్లో గ్రామస్తుల సమైక్యత అంబరాన్నంటింది!

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని రుద్రగూడెం గ్రామంలో మంగళవారం రంగుల కేళిలో మునిగిపోయింది. అందమైన రంగులమయమైన హోలీ పండుగను గ్రామస్తులు పార్టీలకు,కుల మత భేదాలకు అతీతంగా, ఏకతాటిపై నిలబడి అత్యంత ఉత్సాహంగా,ఘనంగా జరుపుకున్నారు,ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది,చిన్నారుల నుండి పెద్దల వరకు, ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకలో భాగమయ్యారు.
ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ,నవ్వులు పంచుకుంటూ గ్రామం మొత్తం ఉల్లాసంగా గడిపారు,చిన్నారులు నీళ్ల రంగులతో ఆటలాడుకుంటే,యువత డప్పుల సప్పుళ్లతో నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళలు ప్రత్యేక వంటకాలు తయారుచేసి పండుగ శోభను మరింత పెంచారు,ఈ వేడుకలు కేవలం వినోదం మాత్రమే కాకుండా,గ్రామస్తుల మధ్య ఉన్న ఐక్యతను, పరస్పర అభిమానాన్ని చాటి చెప్పాయి,ఒక పండుగ అందరినీ ఏకం చేసి,సంతోషాన్ని పంచడం ఎంత గొప్ప విషయమో రుద్రగూడెం హోలీ సంబరాలు నిరూపించాయి. ఈ ఐక్యతా సందేశం అందరినీ ఆకట్టుకుని,మరిన్ని సంవత్సరాలు ఈ పండుగను కలిసి జరుపుకోవాలనే స్ఫూర్తిని నింపింది.
