చెన్నూర్, ఆంధ్రప్రభ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ స్థానిక నాయకులు సన్మానించారు. సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరానికి వెళ్తున్న బండి సంజయ్ ను మార్గమధ్యలోని చెన్నూర్ జాతీయ రహదారిలో మంత్రికి స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. మరి కొద్ది రోజుల్లో మంత్రి సమక్షంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ADB | కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్మానం
