Union Budget | ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి షెడ్యూల్
న్యూ ఢిల్లీ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ముందుంచుతారు. దీంతో ఆమె మరో చరిత్ర సృష్టించనున్నారు.
2019లో ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తాత్కాలిక బడ్జెట్లతో కలిపి వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల.. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ను (వరుసగా 6 సార్లు) అధిగమించారు. శనివారం ఎనిమిదో దానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఆమె మరో మైలురాయిని అందుకోనున్నారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమం చేయనున్నారు. ఇప్పటివరకు అత్యధికంగా 10 సార్లు మొరార్జీ దేశాయ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, పీ. చిదంబరం 9 సార్లు బడ్జెట్ సమర్పించారు.
*8.30 – ఇంటి నుంచి నార్త్ బ్లాక్ (ఆర్థిక శాఖ కార్యాలయం) చేరుకోనున్న నిర్మల
9.00 – నార్త్ బ్లాక్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు పయనం
10.00 – రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు పయనం
పార్లమెంట్లో కేబినెట్ సమావేశం, బడ్జెట్‌కు ఆమోదం
11.00 – లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం04:00 –
*బడ్జెట్ పై నిర్మల సీతారామన్ మీడియా సమావేశం*