బాసర, ఆంధ్రప్రభ : గోదావరి నది (Godavari river) పరివాహక ప్రాంతమైన సాలాపూర్ శివారులో ఈ రోజు ఓ గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయమై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలాన్ని ఎస్సై శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది వెళ్లి పరిశీలించారు. మృతుడి వయస్సు 47 సంవత్సరాల ఉంటుంది. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి ఒంటిపై జంజీరం, రుద్రాక్ష మాల ఉంది. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే బాసర (Basara) పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ శ్రీనివాస్ కోరారు.
గుర్తుతెలియని మృతదేహం..

