మత్స్యశాఖ మరింత అభివృద్ధి..

నాగర్ కర్నూల్ , ఆంధ్ర ప్రభ : మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే (MLA) డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి (Kuchukulla Rajesh Reddy) అన్నారు. ఈ రోజు తెలంగాణ ఇందిరా మహిళా శక్తి, మత్స్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నీలి విప్లవ పథకం (neeli viplava scheme) కింద సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి (Rajesh Reddy) మాట్లాడుతూ… తెలంగాణలో చేపల ఉత్పత్తిని విస్తృతంగా పెంచి, విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మత్స్యకారులు అభివృద్ధి చెందాలన్నారు. అందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు తదితరులు పాల్గొన్నారు.
