మహిళల్లో అక్షరాస్యత పెంచేందుకు ‘ ఉల్లాస్ ‘

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; మహిళల్లో అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం రూపొందించిన ‘ ఉల్లాస్ ‘ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) నవ్ భారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఐకెపి ఆద్వర్యంలో మండలం లోని 10 సెంటర్లలో మహిళా సంఘాల సభ్యులకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. కమ్మర్ పల్లి మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాలను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, ఏంఈవో నేర.ఆంధ్రయ్య,ఐకెపి ఎపీఎం గోపు. కిరణ్ కుమార్ లు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో నిరక్షరాస్యూలను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ ఉల్లాస్ ‘ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సమాజంలోని అందరికీ జీవితకాల అభ్యాసాన్ని అందించడం,15 ఏళ్లు,అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలను అందించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని అన్నారు.
చదువుకు వయసుతో సంబంధం లేదని,అక్షరాస్యతతోనే గ్రామభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు కొత్తపల్లి హారిక అశోక్, కంపదండి అశోక్,రేవతి గంగాధర్,ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏనుగంధుల గంగజమున,ఐకెపి సీసీ లు తదితరులు పాల్గొన్నారు.
