Tributes | ఘ‌నంగా యోగివేమన జయంతి…

Tributes | ఘ‌నంగా యోగివేమన జయంతి…

  • పూలమాల వేసిన సీపీ రాజశేఖర్ బాబు

Tributes | విజయవాడ, ఆంధ్రప్రభ : యోగివేమన జయంతి సందర్భంగా ఎన్.టీ.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు యోగివేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యోగివేమన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు.

Tributes

సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే సరళమైన భాషలో పద్యాలు రచించి ప్రజలను చైతన్యపరిచిన మహాకవిగా యోగివేమనను అభివర్ణించారు. వేమన పద్యాలు వినని, తెలియని వారు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు శ్రీ కృష్ణ కాంత్ పటేల్, కేజీవీ. సరిత,సీపీఓ అధికారులు, పోలీస్ అధికారులు, సీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొని యోగివేమనకు ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply