Tributes | ఆ రెండూళ్లు కన్నీరు మున్నీరు

Tributes | ఆ రెండూళ్లు కన్నీరు మున్నీరు

  • అమెరికాలో ప్రమాదంలో ఇద్దరు మృతి
  • పార్థీవ దేహాల తరలింపు
  • తల్లిదండ్రులకు ఎమ్మెల్యే ఓదార్పు
  • మృతులకు నివాళి

Tributes | ఆంధ్రప్రభ, గార్ల : డిసెంబర్ 29న.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన ఆడబిడ్డల మృతదేహలను శనివారం సొంతూళ్లకు చేర్చారు. గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన కడియాల కోటేశ్వరరావు కుమార్తె భావన పార్థివ దేహాన్ని వాహనంలో ఇంటికి తీసుకొచ్చారు.

ప్రజా సందర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గార్ల పట్టణానికి చెందిన పుల్ల ఖండం నాగేశ్వరరావు కుమార్తె పుల్లఖండం మేఘన పార్థివ దేహాన్ని శంషాబాద్ విమానాశ్రయం నుంచి వాహనంలో గార్ల పట్టణం స్టేషన్ రోడ్ లోని ఇంటికి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తీసుకొచ్చారు. మేఘన పార్థివ దేహాన్ని ప్రజా సంధర్శనార్థం నివాస పరిధిలో ఉంచారు.

ఆ రెండు గ్రామాలు కన్నీటి శోకంలో మునిగి పోయాయి. చివరిగా వారిని చూసేందుకు గ్రామస్తులు వారి ఇళ్లకు చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. భౌతిక కాయాలకు అంజలి ఘటించి నివాళి అర్పించారు.

Leave a Reply