చిత్తూరు జిల్లాలో అగిన చికిత్సలు, ఓపి
- ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం
- ఈ మేరకు ప్రకటించిన స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు (Chittoor) జిల్లాలో శుక్రవారం నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులకు బకాయిలు చెల్లించనందున ఎన్టీఆర్ వైద్య సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి రూ.2700 కోట్ల కంటే ఎక్కువ బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీని కారణంగా, ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించిన చికిత్సలు నిలిచిపోనున్నాయి.
పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలని.. అనారోగ్యంతో ఏ ఒక్క పేదవాడు చనిపోకూడనే మంచి సంకల్పం, సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది పేదలకు మాత్రమే కాదు వైద్య సేవల విషయంలో ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. అయితే ఆరోగ్యశ్రీ ఆసేవలు నిలిచిపోనున్న కారణంగా పేదలు, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు ఉన్న కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. వినికిడి, మాటలు రాని సమస్యలతో పుట్టిన పిల్లలకు రూ. 12 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. క్యాన్సర్ రోగుల (Cancer patients) కు ఎంత ఖర్చయినా ఉచితంగా వైద్యం అందిస్తారు. ఇ హెచ్ ఎస్ లో రూ. 1000 దాటితే 836 రకాల జబ్బులకు, ఆరోగ్యశ్రీలో 3,257 రోగాలకు ఉచితంగా వైద్యం లభిస్తుంది. సంవత్సరానికి రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకాలకు అర్హులు. ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరమైన పథకం. దీని ద్వారా పేద ప్రజలకు మంచి వైద్యం అందుతుంది. పుట్టుకతో వచ్చే చెవుడు, మూగ సమస్యలకు కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. క్యాన్సర్ వ్యాధికి కూడా ఉచితంగా అది కూడా అపరిమితంగా వైద్యం అందిస్తున్నారు. ఈ కార్డు ఉంటే చాలా వరకు వైద్య ఖర్చుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. రూ.వెయ్యి దాటితే ఈహెచ్‌ఎస్‌లో 836, ఆరోగ్యశ్రీలో 3,257 రోగాలకు ఉచిత వైద్యం వర్తిస్తుంది.12 ఎకరాల లోపు మాగాణి భూమి, 35 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు.
మాగాణి, మెట్ట కలిపి 35 ఎకరాల లోపు ఉన్నా కూడా అర్హులే. శాశ్వత ఉద్యోగులు (Permanent employees), పెన్షనర్లు కాకుండా రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఇతర ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరవచ్చు. కుటుంబానికి ఒక కారు ఉన్నా సమస్య లేదు. మున్సిపాలిటీలు, కార్పొరేన్ల పరిధిలో 3వేల చదరపు అడుగుల కంటే తక్కువ ఆస్తి పన్ను చెల్లించే వారు కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ట్రస్ట్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రల వ్యవస్థ రోగులకు ఉచిత సేవలు అందిస్తుంది. ఆరోగ్యమిత్రలు ఉచితంగా సేవలు అందిస్తారు. డిశ్చార్జ్ అయ్యాక రవాణా ఛార్జీలు కూడా ఇస్తారు. రోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి ఐవీఆర్‌ఎస్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయొచ్చు.
డబ్బులు ఎక్కువగా తీసుకుంటే ఫిర్యాదు చేయడానికి 104, 14400 టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయి. అలాగే ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కార్డులు ఉన్నవాళ్లకి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలమనేరు ఏరియా ఆసుపత్రి, శ్రీ కాళహస్తి ఏరియా హాస్పిటల్, మదనపల్లి చంద్ర మోహన్స్ నర్సింగ్ హోమ్, చిత్తూరు డిబిఅర్, ఎస్ కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కుప్పం ఏరియా ఆసుపత్రి, మదనపల్లి ఏరియా ఆసుపత్రి, చిత్తూరు జిల్లా ఆసుపత్రి, తిరుపతి ఓం హాస్పిటల్, మదనపల్లి అగ్నేశ్వర్ ఫ్యామిలీ హాస్పిటల్ , తిరుపతి స్నేహ హాస్పిటల్, తిరుపతి శ్రీ సాయి సుధా హాస్పిటల్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , శ్రీ రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి , తిరుపతి రుయా హాస్పిటల్, తిరుపతి రష్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు అపోలో హాస్పిటల్స్, తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆస్పత్రులు ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సీఈవోలకి లేఖ రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల ఏడువందల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ సిఇఓకి లేఖ రాశారు. బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆస్పత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది. బకాయిలు చెల్లించకపోతే.. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపి సేవలు నిర్వహించలేమంటూ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఏపీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆస్పత్రులు వెనక్కు తగ్గాయి. ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి.