ఇలాంటి టైమ్‌లో శిక్ష‌ణ‌?

ఇలాంటి టైమ్‌లో శిక్ష‌ణ‌?

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మల్దకల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎర్రవల్లి(Erravalli) మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఎన్నికల డ్యూటీలు, మరోవైపు ఎస్ఏ 1(SA 1) పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సిలబస్ పూర్తి చేసుకునే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంద‌ని, ఇలాంటి పరిస్థితుల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అవసరమా..? అంటూ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఇప్పటికే దసరా పండుగ సెలవులు, స్థానిక ఎన్నికల(Election) పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోయిందని ఇప్పుడే పాఠశాలకు విద్యార్థులు నెమ్మదిగా వస్తున్న సమయంలోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. శిక్షణ కార్యక్రమం(Training Program) విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy), వెంకటేష్, భాస్కర్ గౌడ్, రవీందర్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సతీష్చంద్ర, రమణా రెడ్డి, అనిత, రేణుక పాల్గొన్నారు.

Leave a Reply