సర్పంచులందరికి ఒక రోజు శిక్షణా కార్యక్రమం

సర్పంచులందరికి ఒక రోజు శిక్షణా కార్యక్రమం

విజయవంతం చేయాలని కోరిన ఎంపీడీఓ

జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి-ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజులు కార్యాచరణ కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా గురువారం నాడు కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీ సర్పంచులకు ఒకరోజు శిక్షణా, సమావేశ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణరాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ఆదేశించడం జరిగిందని జుక్కల్ ఎంపీడీఓ బి.శ్రీనివాస్ తెలిపారు.

ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈశిక్షణ కార్యక్రమం ఉంటుందని, ప్రజాపాలన, ప్రగతిప్రాణాళిక ప్రధాన్యత, ముఖ్య లక్ష్యాలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సర్పంచులందరికీ శిక్షణ మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంద‌నీ, కాబట్టి కాబట్టి జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు సకాలంలో హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ బి. శ్రీనివాస్ కోరారు.

Leave a Reply