Training | ప్రభుత్వ పాఠశాలలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ

Training | ప్రభుత్వ పాఠశాలలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ

  • శివనగర్ గవర్నమెంట్ హైస్కూల్లో బాలికలకు కరాటే శిక్షణ

Training | కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివనగర్ నందు ప్రధానోపాధ్యాయులు పూస నరేంద్ర స్వామి ఆధ్వర్యంలో 6, 7, 8, 9 వ తరగతుల బాలికలకి జిల్లా విద్యాశాకాధికారి రంగయ్య నాయుడు ఆదేశానుసారము రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షన్ లో భాగంగా సోమవారం శిక్షణ ప్రారంభించామని హెచ్ఎం వెల్లడించారు.కరాటే మాస్టర్ రేణి కుంట్ల శివకుమార్ చే ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివనగర్ బాలికలకి కరాటేలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించడం జరిగినది.

ప్రధానోపాధ్యాయులు పూస నరేంద్ర స్వామి మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించడానికి ప్రభుత్వం ముఖ్యంగా పాఠశాలలో చదివే ఆడపిల్లలకి ఆత్మ రక్షణ కొరకు కరాటేలో శిక్షణ ఇప్పించంధం జరుగుతోంది. కాబట్టి విద్యార్థినిలు ఈ అవకాశాన్ని భవిష్యత్తులో స్వీయ రక్షణకు సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ శిక్షణ వలన మానసిక ధైర్యం, శారీరక పటిష్టత ఏర్పడు్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply