Tragic Incident | కరెంట్ షాక్‌తో…

Tragic Incident | కరెంట్ షాక్‌తో…

Tragic Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పార్వతిపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెట్టుపైకి ఎక్కిన విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం ఎం. మామిడిపల్లి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. 9వ తరగతి విద్యార్థి కొర్ర దిలీప్ పాఠశాల ప్రహరీ గోడ పక్కనున్న చెట్టుపై అరటిపండ్లు తెంపేందుకు ఎక్కాడు. ఈ సమయంలో చెట్టుపైనున్న విద్యుత్ తీగను అనుకోకుండా తాకడంతో అతడు తీవ్రంగా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యార్థి తల్లిదండ్రులు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply