గోపేపల్లిలో విషాదం
ఇద్దరిని బలిగొన్న మూలమలుపు
మరొకరికి తీవ్ర గాయాలు
శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 19( ఆంధ్రప్రభ): శ్రీ సత్య సాయి జిల్లా కదిరి -పుట్టపర్తి మధ్యలో నల్లమాడకు సమీపంలోని గోపేపల్లి మలుపు వద్ద ఆదివారం మోటార్ బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లమాడకు చెందిన ముగ్గురు యువకులు కదిరి నుంచి నల్లమాడ కు ద్విచక్ర వాహనంలో వస్తూ గోపేపల్లి మలుపు వద్ద బైక్ అదుపు చెప్పడంతో ముగ్గురు యువకులు కింద పడిపోయారు. ఇందులో అరుణ్ కుమార్ (19) లక్ష్మణ్ సాయి( 20 ) అక్కడికక్కడే మృతిచెందగా బన్నీ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నల్లమాడ పోలీసులు తెలిపారు.