సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు మంగళ వాయిద్యాలతో, పూర్ణకుంభంతో మహేష్ కుమార్ గౌడ్ దంపతులకు స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారి సన్నిధిలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply