TP |మోసపూరిత ప్లాన్లు ఎందుకిచ్చారు?
- రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు
TP | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : మాజీ సైనికుల గృహాలను మాస్టర్ ప్లాన్ అనుకూలంగా లేవని కూల్చుతామనడంలో ఆంతర్యం ఏమిటని బాపట్ల పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డి(Raghunatha Reddy)ని రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ప్రశ్నించారు. గురువారం పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ వలన సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ సాంబశివరావు(Thanda Sambasiva Rao) పురపాలక కమిషనర్ తో సమావేశమయ్యారు.
బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నరాల శెట్టి వారి పాలెం కోర్టు ప్రాంతం నుండి పెయింటర్స్ కాలనీ వరకు మాస్టర్ ప్లాన్ వలన సైనికుల కుటుంబాలు ఇబ్బందులు గురవుతున్నారని కమిషనర్ కు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణ షీలా దృష్టికి తీసుకు వెళ్లడమే కాకుండా స్వయంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్(Sainik Welfare) ఆఫీసర్ తో కలిసి బాధిత కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా తాండ్ర మాట్లాడుతూ.. దేశ సేవలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని సైనికులు ఉద్యోగ విరామననంతరం మున్సిపాలిటీ ప్లానింగ్ విభాగం అనుమతితో మాజీ సైనికులు గృహ నిర్మాణాలు(House constructions) చేసుకున్నారని ఇప్పుడు మాస్టర్ ప్లాన్ పేరుతో కూలగొడతామని అనడం సమంజసం కాదని కమిషనర్ ను తాండ్ర కోరారు.

మాస్టర్ ప్లాన్ ముందు నుంచే ఉంటే మరి ప్రజలకు మున్సిపల్ అధికారులు అధికారికంగా మోసపూరిత ప్లాన్లు ఏ విధంగా ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్(Master plan) లో రహదారిగా ఉన్న స్థలాలను వ్యాపారస్తులు ప్లాట్లు చేసి అక్రమంగా అమ్ముకుంటుంటే చోద్యం చూస్తూ ఉన్న అధికారులు వ్యాపారస్తులకు కొమ్ము కాస్తూ మోసపూరితంగా రోడ్డు స్థలాలకు అధికారికంగా మున్సిపల్ ప్లాన్లు సైతం ఇవ్వటం ఘోరమైన విషయమని తెలియజేశారు. మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కమిషనర్‌ను కాండ్ర కోరారు.
కమిషనర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేయడానికి సాయి శక్తుల ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు తాండ్ర తెలిపారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం బాపట్ల అధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రెటరీ షేక్ మోయునిద్దీన్, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు తదితరులు కమిషనర్ తో సమావేశమయ్యారు.

