Top stars | టాప్ స్టార్స్ న్యూయర్ ప్లాన్ ఇదే..

Top stars | టాప్ స్టార్స్ న్యూయర్ ప్లాన్ ఇదే..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలుగు సినిమాకి ఫోర్ పిల్లర్స్ అంటే ఠక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌. ఈ నలుగురు హీరోలు కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు(In front of the audience) వచ్చేందుకు.. ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ.. ఈ నలుగురు 2026లో ఏ ఏ సినిమాలతో రాబోతున్నారు..? ఈ టాప్ స్టార్స్ ప్లాన్ ఏంటి..?

Top stars | రెండు సినిమాలతో వస్తోన్న మెగాస్టార్..

Top stars

మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరంలో మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ వస్తున్నారు. ఈ భారీ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ముఖ్యపాత్ర పోషించడం విశేషం. చిరు లుక్, స్టైల్ అంతా చూస్తుంటే.. ఓ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ విశేషంగా ఆకట్టుకుని సినిమా పై మరింతగా అంచనాలు పెంచేసింది. జనవరి 12న మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు ఈ ఇయర్ లో చిరు.. విశ్వంభర అనే సినిమా(The movie Vishwambhara)తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీని మల్లిడి వశిష్ట్ తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. సమ్మర్ లో విశ్వంభర రిలీజ్ కానుంది. ఈ ఇయర్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ చేయడం.. బాబీతో సినిమాను.. శ్రీకాంత్ ఓదెల మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు మెగాస్టార్ ప్లాన్ చేశారు.

Top stars | బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్..

Top stars

ఇక బాలయ్య విషయానికి వస్తే.. మలినేని గోపీచంద్ డైరెక్షన్(Directed by Malineni Gopichand) లో భారీ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య, మలినేని గోపీచంద్.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతోన్న మూవీ ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యను ఇంతకు ముందు ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా చూపించబోతున్నారు. ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు(The film is set to hit the screens for Dussehra.) వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇక మార్చిలో బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేయబోతున్నారని, ఈ క్రేజీ మూవీకి క్రిష్ దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది.

Top stars | నాగ్ 100..

Top stars

టాలీవుడ్ కింగ్ నాగార్జున 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని తమిళ డైరెక్టర్ కార్తీక్(Tamil director Karthik) తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చారు. ఇందులో సీనియర్ హీరోయిన్స్ అనుష్క, టబు(Senior heroines Anushka, Tabu) నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. సమ్మర్ లో ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత నాగ్ 101 చిత్రాన్ని కూడా ఈ ఇయర్ లోనే అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

Top stars | ఆనంద నిలయంలో వెంకీ..

Top stars

2025 సంక్రాంతికి వెంకీ.. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్(Come with a movie and become a blockbuster) సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సంక్రాంతికి మెగాస్టార్ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో వెంకీ ముఖ్యపాత్ర పోషించారు. జనవరి 12న ఈ సినిమాతో వెంకీ ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. ఆతర్వాత ఆనంద నిలయం అనే సినిమాతో రానున్నారు. వెంకీ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas, the magician of words) ఆనంద నిలయం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ మరో సినిమాను కూడా ఈ ఇయర్ లోనే స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ఇలా ఆ నలుగురు స్టార్ హీరోలు(Four star heroes) ఈ ఇయర్లో పక్కా ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఈ నలుగురు ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

CLICK HERE TO READ అంచనాలు పెంచేసిన స్పిరిట్ లుక్

CLICK HERE TO READ MORE

Leave a Reply