సామర్థ్యాన్ని పంపొందించేందుకే..
నంద్యాలలో 27మందికి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
నంద్యాల బ్యూరో అక్టోబర్ 25 ఆంధ్రప్రభ : సామర్థ్యాన్ని పంపొందించేందుకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ వ్యవస్థలో సాంకేతికత పాత్ర అనే అంశంపై శనివారం నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్దగల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు 27మంది పోలీసులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. సాంకేతికత పోలీసుల విధుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. ఇది నేరాలను నివారించడం, గుర్తించడం, దర్యాప్తు చేయడంలో పోలీసుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతోందని, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారని తెలిపారు.
నేర నివారణ, నిఘా గ్రామీణ,పట్టణాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నిర్వహణ నేరాల గుర్తింపు సులభం అవుతుందన్నారు.దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ, ఆధునిక నేర దర్యాప్తులో డిజిటల్ సాక్ష్యాల సేకరణ కీలకం. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సమాచారాన్ని సేకరించి, కోర్టులో సాక్ష్యంగా సమర్పించడం దీనిలో భాగమని తెలిపారు.. ఇంటర్నెట్ ఆధారిత నేరాలైన సైబర్ స్టాకింగ్, ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్‌లను పరిష్కరించడానికి ప్రత్యేక సైబర్ క్రైమ్ యూనిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు.
వ్యాసరచన, వక్తృత్వ పోటీలు సాయుధ బలగాల డీఎస్పీ శ్రీనివాసరావు , రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ మనోహర్, టీచర్లు పి.కిరణ్ కుమార్ రెడ్డి, కె.సుందర్ రావు, కె.వి సుబ్బారెడ్డి, జి .నాగేంద్ర కుమార్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.

