Tirumala | శ్రీవారి సేవలో ముద్దాడ..

Tirumala | శ్రీవారి సేవలో ముద్దాడ..

రవిచంద్రకు ఈవోగా బాధ్యతలు..
తిరుమల చేరుకున్న టీటీడీ నూతన ఈవో..
స్వాగతించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు నేడో, రేపో బాధ్యతల స్వీకరణ..
అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం..
నేడో, రేపో బాధ్యతల స్వీకరణ..

తిరుమల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా, శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలానికి చెందిన రవిచంద్ర ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ రోజు లేదా రేపు ఆయన టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలను స్వీకరించను న్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సమర్థతను దృష్టిలో ఉంచుకుని.. ముద్దాడ రవిచంద్ర 1996 బ్యాచికి చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. 1972 సంవత్సరం ఆగస్ట్ 19న జన్మించిన రవిచంద్ర స్వస్థలం జులమూరు. ఐఏఎస్కి ముందు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడగలరు. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ పరిపాలన విభాగంలో కీలక బాధ్యతల్లో కొనసాగిన రవిచంద్ర పై ఉన్న విశ్వాసం, సమర్థతను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు టీటీడీ ఈవోగా బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన కార్యనిర్వహణ అధికారి బాధ్యతలను తెలుగు రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్కి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం టీటీడీ నూతన ఈవోగా నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, గురువారం తిరుమలకు వచ్చిన ఈవో రవిచంద్రకు అధికార యంత్రాగం ఘన స్వాగతం పలికింది. స్వాగతించిన వారిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జేసీ ఆర్.గోవిందరావు, ఎస్పీ ఎల్.సు బ్బరాయుడు తదితరులున్నారు.

Leave a Reply