Tirumala | బకెట్లు, బిందెలతో ఎగబడ్డ జనం

Tirumala | బకెట్లు, బిందెలతో ఎగబడ్డ జనం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి ముఖ్యమైనది. ఆయా డెయిరీల నుంచి నెయ్యిని సేకరించి.. ట్యాంకర్ల ద్వారా తిరుమలకు తరలిస్తారు. ప్రతి రోజూ నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వస్తుంటాయి.. ఇలా వస్తున్న ఓ నెయ్యి ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ఘటన కడప జిల్లా కొండాపురం దగ్గర జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

Tirumala

తిరుమలకు నెయ్యి తీసుకెళ్తున్న ట్యాంకర్ బోల్తాపడడంతో జనం క్యాన్లు, బకెట్లు, బిందెలు, బాటిళ్లతో నెయ్యి కోసం ఎగబడ్డారు.. అక్కడి నుంచి నెయ్యిని తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జనాలు నెయ్యి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. పుణె నుంచి 21వేల లీటర్ల నెయ్యితో ట్యాంకర్ తిరుమలకు వస్తుండగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం పెంజిఅనంతపురం దగ్గరకు రాగానే.. అక్కడ నేషనల్ హైవే-67పై మలుపులో అదుపు తప్పి ట్యాంకరు బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ట్యాంకర్‌ డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Leave a Reply