చౌటుప్పల్ మండలంలో గెలుపొందిన సర్పంచ్‌లు వీరే…

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో మూడో విడతలో నిర్వహించిన 26 గ్రామాల గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుల పర్యవేక్షణలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై, వెంటవెంటనే ఫలితాలను అధికారులు ప్రకటించారు. చౌటుప్పల్ మండలంలో మొత్తం 26 గ్రామపంచాయతీలు, 236 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎల్లంబావి గ్రామ సర్పంచ్‌గా గంజి వనజ కృష్ణ (కాంగ్రెస్), దామెర గ్రామ సర్పంచ్‌గా సాతిరి శ్రీధర్‌రావు (కాంగ్రెస్), ఎల్లగిరి గ్రామ సర్పంచ్‌గా రిక్కల మహేందర్‌రెడ్డి (స్వతంత్ర) ఎన్నికయ్యారు. అదేవిధంగా మరో 21 వార్డు సభ్యుల స్థానాలు గ్రామస్తుల సమ్మతితో ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 23 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలు, 215 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగగా, ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
చింతలగూడెం గ్రామ సర్పంచ్‌గా ముస్కు అంజిరెడ్డి (కాంగ్రెస్), చిన్నకొండూరు గ్రామ సర్పంచ్‌గా తీగుళ్ల చంద్రయ్య (కాంగ్రెస్), ధర్మోజిగూడెం గ్రామ సర్పంచ్‌గా జువ్వి నరసింహ (కాంగ్రెస్), దేవలమ్మనాగారం గ్రామ సర్పంచ్‌గా సురుగు గౌరీ శ్రీనివాసులు (కాంగ్రెస్), కైతాపురం గ్రామ సర్పంచ్‌గా ఎల్మ రామలింగేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్), మసీదుగూడెం గ్రామ సర్పంచ్‌గా మర్రి వంశీధర్‌రెడ్డి (కాంగ్రెస్), నేలపట్ల గ్రామ సర్పంచ్‌గా గంగాపురం వసంత నాగేశ్ గౌడ్ (కాంగ్రెస్), పీపల్‌పహాడ్ గ్రామ సర్పంచ్‌గా పులనగారి నాగేశ్వరి–అశ్వినీకుమార్ (కాంగ్రెస్), స్వాములవారి లింగోటం గ్రామ సర్పంచ్‌గా భీమిడి ప్రదీప్ జి (కాంగ్రెస్) ఎన్నికయ్యారు.
అలాగే అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్‌గా సుర్వి మల్లేష్ గౌడ్ (బీఆర్ఎస్), కుంట్లగూడెం గ్రామ సర్పంచ్‌గా అన్యాలపు నరేష్ (బీఆర్ఎస్), దండు మల్కాపురం గ్రామ సర్పంచ్‌గా గిర్కటి నిరంజన్ గౌడ్ (బీఆర్ఎస్), పంతంగి గ్రామ సర్పంచ్‌గా కాకి శ్రీలత సుందరయ్య (బీఆర్ఎస్), పెద్దకొండూరు గ్రామ సర్పంచ్‌గా గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్ (బీఆర్ఎస్), తూఫ్రాన్‌పేట గ్రామ సర్పంచ్‌గా బట్టతట్ల రాధిక–శ్రీశైలం (బీఆర్ఎస్), ఎనగంటి తండా గ్రామ సర్పంచ్‌గా కరెంటోతు రాజు నాయక్ (బీఆర్ఎస్) ఎన్నికయ్యారు.
బీజేపీ తరఫున అల్లాపురం గ్రామ సర్పంచ్‌గా టేకుల మంజుల దిలీప్‌రెడ్డి, గుండ్లబావి గ్రామ సర్పంచ్‌గా నందగిరి వెంకటేష్, కాట్రేవు గ్రామ సర్పంచ్‌గా బోయ మహేంద్రమణి శరత్‌కుమార్, కొయ్యలగూడెం గ్రామ సర్పంచ్‌గా కరిమికొండ స్వప్న–అశోక్ ఎన్నికయ్యారు. ఆరెగూడెం గ్రామ సర్పంచ్‌గా ఎన్నపల్లి ధనలక్ష్మి వెంకట్‌రెడ్డి (స్వతంత్ర) విజయం సాధించారు.
ఇదిలా ఉండగా, మండలంలోని జై కేసారం గ్రామ సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్కడ 12 వార్డుల్లో 8 వార్డులు బీఆర్ఎస్‌కు, 4 వార్డులు కాంగ్రెస్‌కు వచ్చినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది.
