Telangana | అధికారుల పర్యవేక్షణ ఉండాలి

Telangana | అధికారుల పర్యవేక్షణ ఉండాలి
లంబాడీ జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మెన్ డాక్టర్ శంకర్ నాయక్
Telangana | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : పత్తి కొనుగోలు (Cotton purchase) కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, సబ్ మార్కెట్ లో నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలని లంబాడీ జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మెన్ డాక్టర్ శంకర్ నాయక్ (Dr.Shankar Nayak) డిమాండ్ చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని పత్తి కొనుగోలు కేంద్రం (సబ్ మార్కెట్) ను సందర్శించి, సమస్యలను రైతులు హమాలీలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శంకర్ నాయక్ (Dr.Shankar Nayak) మాట్లాడుతూ… ఏన్కూర్ ఎఎంసి పరిధిలోని సబ్ మార్కెట్ లో విద్యుత్ సౌకర్యం లేక రాత్రి సమయంలో పాము కాటుకు గురవుతున్నారన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన వ్యాపారులు పందిళ్ళు వేసుకుని పట్టు కొనుగోలు చేస్తున్నారన్నారు. రెండు మూడు జిల్లాల నుంచి అత్యధికంగా జూలూరుపాడు సబ్ మార్కెట్ కు రైతులు (Farmers) పత్తిని తీసుకువస్తున్నారన్నారు. ప్రతి రోజు వేలాది క్వింటాలు పత్తి పంట క్రయ విక్రయాలు జరుగుతున్నాయన్నారు. సుమారు వెయ్యిమంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సబ్ మార్కెట్ (sub-market) ను ఏఎంసి అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని శంకర్ నాయక్ విమర్శించారు.
పత్తి కొనుగోలు (Cotton purchase) సమయంలో తేమ శాతం ఎక్కువగా ఉందని ధరలు తక్కువగా చెల్లిస్తున్నారని శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. వేబ్రిడ్జ్ కాటాపై పత్తి తుకానికి, వేరే చోట పెట్టిన తుకానికి వ్యత్యాసం వస్తుందని, దీని కారణంగా వ్యాపారులు, రైతులకు వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలు పరిష్కరించే వ్యవస్థ సబ్ మార్కెట్లో అందుబాటులో లేకుండా పోయిందన్నారు.
మార్కెట్ అభివృద్ధి (Market development) కి నిధులు మంజురైనా పనులు ప్రారంభించలేదన్నారు. మార్కెట్లో నెలకొన్న సమస్యలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్ రైతులు, హమాలీలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుగులోత్ కేశవ్ నాయక్, ధారావత్ కాన్సిరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
