ఆ వార్తల్లో నిజం లేదు – ఎమ్మెల్యే బడేటి చంటి

ఆ వార్తల్లో నిజం లేదు – ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అంబులెన్సుల నిర్వహణ పై ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉదయాన్నే స్వయంగా ఆసుపత్రిని సందర్శించి అంబులెన్సులను పర్యవేక్షించారు. అంబులెన్సులు సరిగా పని చేయడం లేదని ప్రచురితమైన వార్తలు పూర్తిగా వాస్తవ రహితమైనవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కావాలనే పాడైపోయిన, వినియోగంలో లేని అంబులెన్సులను చూపించి వార్తలు రాసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మీడియా కథనాల పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో అన్ని హంగులతో, ఆధునిక వైద్య సదుపాయాలతో పూర్తి స్థాయిలో పని చేస్తున్న అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగంగా సేవలందించేందుకు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని, ఎలాంటి నిర్లక్ష్యం జరగడం లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల మెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply