COUNTRY| వారి సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు..

COUNTRY| వారి సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు..

  • సాంస్కృతిక కళా సంపదలు భావితరానికి వన్నెతగ్గని వనరులు..
  • కలెక్టర్ జి.లక్ష్మీశ

COUNTRY| విజయవాడ, ఆంధ్రప్రభ: కవులు, రచయితలు, కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని భారత సంస్కృతి, సాంప్రదాయాలు భావితరానికి తరగని వనరులవంటివని కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కౌహాన్స్ సంస్థ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను శనివారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్లు జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ళ నారాయణ రావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను అందించిన సాంస్కృతి రచన కళా సంపదలు భావితరానికి తరగని వనరులలాంటివన్నారు. రచయితలు కళాకారులు కళలను ఆదరించిన ప్రదేశం ఎప్పటికి ప్రజ్వరిల్లుందన్నారు. ఆధునిక జీవనశైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక కళా సంపదను పరిరక్షించుకుంటూ వాటిని భావితరాలకు అమూల్యమైన వారసత్వ సంపదగా అందించేందుకు కవులు, రచయితలు, కళాకారులు వేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

మల్లతీగ సాహిత్య సేవ సంస్థ కవులు రచయితలు కళాకారులు కార్యునిస్టులను ప్రోత్సహించేందుకు కథలు కవితలు కార్యుల పోటీలను నిర్వహించి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన మల్లెతీగ సాహిత్య సేవ సంస్థ కన్వీనర్ కలిమిశ్రీ ఇతర సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చేవారికి జిల్లా యంత్రాంగం తరుపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. గొప్ప సాంస్కృతిక కేంద్ర బిందువైన విజయవాడ నగరం కవులు రచయతలు కళాకారులకు పుట్టినిల్లువంటిదన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కూచిపూడి నృత్యం ఉమ్మడి కృష్ణాజిల్లాకు కేంద్ర బిందువుకావడం జ్ఞాన పీఠం అవార్డు గ్రహీతలు, గాయక రత్నాలు, ఘన చరిత్ర కలిగిన ఎందరో జానపద కూచిపూడి భరతనాట్య కళాకారులు రచయతలు కవులు సినిరంగ కళాకారులు పుట్టినట్టువంటి గడ్డపై జాతీయ సాంస్కృతిక ఉ త్సవాలను నిర్వహించడం గర్వకారణమన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రప్రంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టిటి రామారావు స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి సాంస్కృతిక రంగాన్ని ప్రాధాన్యతనిచ్చి కవులు రచయతలు కళాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేశారన్నారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు మరిన్ని నిధులను కేటాయించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కళా రంగానికి మరింత వైభవాన్ని తీసుకువచ్చేలా తనవంతు కృషిచేస్తానన్నారు. తెలుగు భాషను పరిరక్షించేందుకు బడి ఏలుబడిలలో తెలుగు భాషను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కార్టుల పోటీలలో గెలుపొందిన కార్టూన్ల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలగించాయి.

Leave a Reply