తీన్మార్ మల్లన్నకాంగ్రెస్ పార్టీ నుంచి ఔట్
పార్టీ వ్యతిరేక వ్యాఖ్యాలపై సీరియస్
కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తూ క్రమశిక్షణా కమిటీ ఉత్తర్వులు
పార్టీ లైన్ ఎవరు దాటినా ఇదే శిక్ష అన్న టిపిసిసి చీఫ్
హైదరాబాద్ – ఎమ్మెల్సీ చింతపండు నీవన్ (తీన్నార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నేడు ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. కాగా.. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత అదేశాలతోనే తీన్మార్ మల్లన్నన పార్టీ నుంచి బహిష్కరించినట్లు వెల్లడించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారందరికీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ హెచ్చరికంగా ఉంటుందని అన్నారు..
