పోలీసుల‌కు చిక్కిన నిందితులు

  • 12 మంది సభ్యుల ముఠాలో
  • 8 మంది అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
  • రెండు 500 రూపాయల నకిలీ నోట్లతో పెద్ద నకిలీ నోట్ల తయారీ
  • జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడి

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : దొంగ నోట్లు తయారు చేస్తూ చలామణి చేస్తున్నముఠాను కామారెడ్డి పోలీసులు(Kamareddy Police) పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లయింది. 500 రూపాయల నకిలీ నోటుతో మద్యం షాపులో మద్యం కొనుగోలు చేయగా ఆ వ్యక్తిని పూర్తి స్థాయిలో విచారించగా అసలు గుట్టు రట్టయింది. ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) వెల్లడించిన వివ‌రాలు.. గత నెల 28న ఉదయం 11 గంటలకు మేకల అఖిల్(Akhil the goat) వైన్స్ క్యాషియర్ కామారెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చి దరఖాస్తు ఫిర్యాదు చేశారు.

తాను 23-09-2025 రోజు తాను వైన్స్ లో ఉండగా కౌంటర్ మీద ఉన్న చందు వద్దకు ఒక వ్యక్తి వచ్చి రెండు 500 రూపాయాల నోట్లు ఇచ్చి ఐకానిక్ విస్కీ ఫుల్ బాటిల్ కొనుగోలు చేసి అతనికి రావలసిన చిల్లర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అనుమానం వచ్చి ఆ 500 రూపాయలు నోట్లను పరిశీలించి మేఖల అఖిల్ తో కలిసి నోట్లు ఇచ్చిన వ్యక్తి వద్దకు వెళ్ళి ఈ నోట్లు ఎక్కడివి అని అడగగా అతని పేరు సిద్ధ గౌడ్(Siddha Goud) అని తెలిపి నాకు ఇవి తన సాలరీ డబ్బులు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలిపారు.

ఈ నోట్లు మందంగా ఉండి, కలర్ ఎక్కువగా ఉన్నవని దొంగ నోట్లుగా అగుపిస్తున్నావని కామారెడ్డి పోలీస్ స్టేషన్(Police Station) కు వచ్చి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏఎస్పీ బీ. చైతన్య రెడ్డి(B. Chaitanya Reddy) పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్, పోలీసు సారద్యంలో ఎనిమిది బృందాలు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


ఈ కేసు దర్యాప్తులో భాగంగా 28.09.2025 నాడు రామేశ్వరపల్లి(Rameswarapalli) గ్రామానికి చెందిన సిద్ధా గౌడ్నిని పట్టుకొని విచారణ చేయగా అతను డబ్బులు సులభంగా సంపాదించాలని ఆన్లైన్ లో చూస్తుండగా ఫేస్బుక్లో ఫేక్ కరెన్సీ గ్రూపులు చూసి అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు కాంటాక్ట్ అవ్వగా అప్పుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన సౌరవ్ డే అనే వ్యక్తి కాంటాక్ట్ అవగా అతను ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి సిద్దగౌడ్ కు కాంటాక్ట్ అయినాడని తెలిపారు.

అప్పుడు ఫేక్ నోట్లు కావాలా అని అడుగగా సిద్దగౌడ్ కావాలి అని చెప్పి రూపాయలు ఐదువేలకు గాను పదివేల నకిలీ నోట్లు పంపుతానని ఒప్పందం కుదుర్చుకొని 18.09.2025 నాడు కొరియర్ ద్వారా ఇతనికి 18 నకిలీ నోట్లు పంపినాడని ఆ నోట్ల నుంచి రెండు నోట్లు తీసుకొని వచ్చి శ్లోమ వైన్స్(Shloma Wines) కామారెడ్డిలో మద్యం కొనుగోలు చేసినాడని తెలిపాడు. అనంతరం కామారెడ్డి ఇన్స్పెక్టర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ బృందం సౌరవ్ డేను పట్టుకోవడానికి వెస్ట్ బెంగాల్ వెళ్లి అక్కడ సౌరబ్ డే ను 27.09.2025 పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి హరి నారాయణ భగత్ అనే వ్యక్తితో కలిసి ఈ ఫేక్ నోట్లను బీహార్ కు చెందిన రషీద్ అనే వ్యక్తి ద్వారా కొరియర్‌లో తెప్పించుకొని అందరూ కస్టమర్లకు సప్లై చేస్తున్నట్టు తెలిపినాడు.

సౌరవ్ డేను హరి నారాయణ భగత్ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కామారెడ్డి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. అనంతరం బీహార్ కు చెందిన రషీద్ ను పట్టుకోవడానికి సీసిఎస్ ఇన్స్పెక్టర్(CCS Inspector), ఎస్సై రాజులు తమ బృందం తో బీహార్ కు వెళ్లి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బీహార్‌లో రషీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుకున్నాను అని తనకు కలర్, కెమికల్ మిక్సింగ్ వాటి మీద మంచి అవగాహన ఉండడంతో ఫేక్ కరెన్సీ నోట్లు తయారుచేసి డబ్బులు అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో నందు లాల్ జంగ్ డే చట్టరామ్, సౌరవ్ డే, హరి నారాయణ భగత్, పండిత్@ శరతక్ జా, కరెన్సీ కాట్ని @ లఖన్ కుమార్ దుబే, దివాకర్ చౌదరి @ బ్రిజేష్ కుమార్, సత్య దేవ్ యాదవ్ శివ శర్మ(Satya Dev Yadav Shiva Sharma) @ ప్రమోద్ కాట్రేలు అందరు ఒక గ్రూపుగా ఏర్పడి ఫేక్ కరెన్సీనీ తయారుచేయాలని పథకం వేసుకొని వారు అనుకున్న విదముగానే నందులాల్ జంగ్ డే చట్రం ముగ్గురం కలిసి బిక్రమ్ గంజిలోని వివిధ షాపులలో నకిలీ నోట్లు తయారు చేయడానికి కావాలసినటువంటి కంప్యూటర్ ఇతర సామాన్లు కలర్స్, ఇంకు ప్రింటర్స్, కట్టర్స్, లామినేటర్స్, టోనర్స్, కలర్ ప్రింటర్ ఇంకా అందుకు సంబంధించిన పేపర్ లను ఇంకా ఇతర సామగ్రి లను కొనుగోలు చేసి 500, 200, 100, 50, మరియు 20 రూపాయల నకిలీ నోట్లను 1:2 రేషియో ద్వారా తీసుకొని, ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన కస్టమర్ ల నుండి వివిద నెంబర్ ల స్కానర్ లకు డబ్బులు పంపించుకొని వారికి 1:2 రేషియోలో ఫేక్ నోట్లను కొరియర్ ద్వారా పంపిస్తుంటారు.

సచి ఢిల్లీ పార్టీ హర్యానా(పానిపట్), అరవింద్ కుమార్ అమరోహ పార్టీ ఉత్తరప్రదేశ్, చంద్ర ప్రకాష్ స్వామి జైపూర్ రాజస్తాన్ పార్టీ, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ పార్టీ, విక్కీ పార్టీ కలకత్తా , సర్కస్ కలకత్తా(Circus Calcutta) పార్టీ, ఆకాష్ టాటా, కిదిర్ పూర్ కలకత్తా వెస్ట్ బెంగాల్, బరబజార్ కలకత్తా పార్టీ,రాజేంద్ర చౌరాసియా @ పప్పుపల్ ఉత్తరప్రదేశ్ పార్టీ, ముకేష్ మెదనీపూర్ వెస్ట్ బెంగాల్, రాంగోపాల్ వర్మ వెస్ట్ బెంగాల్ పార్టీ, కలకత్తా నవదీప్ పార్టీ, సూరత్ పార్టీ గుజరాత్, పాట్నా పార్టీ బీహార్, జార్ఖండ్ పార్టీ, ప్రదీప్ పార్టీ వెస్ట్ బెంగాల్, సోనూ కుమార్ బొకారో పార్టీ జార్ఖండ్, అమిత్ గొడ్డా పార్టీ, ప్రీతం మొండల్ గొరియా కలకత్తా పార్టీ, దీపక్ కలకత్తా పార్టీ, అయాన్ చక్రవర్తి రాహుల్ లేక్ మోర్ కలకత్తా పార్టీ పై వారితో పాటు ముద్రించిన నకిలీ కరెన్సీ ని భారత దేశంలోని వివిద రాష్ట్రాలకు కూడా పంపించారని తెలిపారు. నేరస్తులు మన దేశ ఆర్థిక వ్యవస్తను దెబ్బతీయాలని, అమాయక ప్రజలను మోసగించి వారు అధిక డబ్బులు సంపాదించాలనే దురుద్దేశం తో ఈ నేరానికి పాల్పడ్డారన్నారు.

ఇబ్నుల్ రషీద్, (బీహార్), నందు లాల్ జంగ్ డే (చత్తీస్ ఘర్), చట్టరామ్(చత్తీస్ ఘర్), సౌరవ్ డే (పశ్చిమబెంగాల్), హరి నారాయణ భగత్ (పశ్చిమ బెంగాల్, పండిత్@ శారతక్ జా (పశ్చిమబెంగాల్),కరెన్సీ కాట్ని @ లఖన్ కుమార్ దుబే, (యుపీ), దివాకర్ చౌదరి @ బ్రిజేష్ కుమార్ ఉత్తరప్రదేశ్ సత్య దేవ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్, శివ శర్మ @ ప్రమోద్ కాట్రే (మహారాష్ట్ర), సిద్ద గౌడ్, కృతిక రాజ్ లుగా గుర్తించినట్లు తెలిపారు. నేరస్తులలో నలుగురిని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.

త్వరలో మిగతా వారిని పట్టుకొని రిమాండ్ కు పంపుతామన్నారు. కాగా నిందితుల నుంచి 3,08300 ఫేక్ కరెన్సీ, రూ. 15,300 అసలు కరెన్సీ , కారుతో పాటు కంప్యూటర్, కలర్ ప్రింటర్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నకిలీ కరెన్సీని( Fake Currency) ముద్రించి వాటిని వివిద వ్యక్తులకు పంపి సంపాదించిన డబ్బులను వారి విలసాలకు ఉపయోగిస్తున్నారు. ఈ విదముగా సంపాదించిన డబ్బులతో దివాకర్ చౌదరి @ బ్రిజేష్ కుమార్ అనే నిందితుడు 4,40,000 రు. పెట్టి బ్రెజా(Brezza) కారు ను కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

ప్ర‌జలందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ పట్ల జాగ్రత్తగా ఉంటూ మీకు ఎవరైనా నకిలీ కరెన్సీ ఇస్తామని ఆశ చూపిన, లేదా నకిలీ కరెన్సీ చలామణి అవుతుందని సమాచారం తెలిసిన లేదా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ద్వారా ఎర వేస్తున్న ఇలాంటి నేర పూరిత వ్యవహారాల జోలికి పోకుండా పోలీసు శాఖ వారికి తెలియజేయాలన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకొని మన దేశ ఆర్థిక వ్యవస్త పై జరిగే ఈ ఆర్థిక నేరాలను అరికట్టాలన్నారు.

ఈ దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకోవడము లో చాకచక్యంగా, సమయస్పూర్తి తొ వ్యవహరించి నిందితున్ని పట్టుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్(CCS Inspector Srinivas), కామారెడ్డి పట్టణ ఇన్ స్పెక్టర్ నరహరి, సీఐ సంతోష్, ఎస్సైలు రాజు, కామారెడ్డి, రాజశేకర్, అనిల్, లు, సిబ్బంది నర్సింగ్ రావు, రంగా రావు, శ్రీనివాస్ మహేందర్ రెడ్డి, రాజావీర్, కిషన్, గణపతి, సంపత్, మైసయ్య, రవి, శ్రీనివాస్, శ్రవణ కుమార్, చేతన్, రాజేంద్ర కుమార్, లక్ష్మికాంత్, విశ్వనాథ్, మధు, లింగం, ఇర్ఫాన్ లను జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.


సకాలములో టికెట్ రిజర్వేషన్ అంధించిన భారతీయ రైల్వే అధికారులకు అదేవిధంగా వివిధ రాష్ట్రాలలోని జిల్లాలలో నేరస్తులను పట్టుకోవడములో మన జిల్లా పోలీసు బలగాలకు భద్రత సహకారం అంధించిన జిల్లా ఎస్పిలు వారి సిబ్బందికి ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి తోడ్పడినందుకు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply