ఇందూరు మేయర్ పీఠం మాదే..

ఇందూరు మేయర్ పీఠం మాదే..

ఇందూర్ గా పేరు మారుస్తాం..
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం..

మెదక్ ఎంపీ రఘునందన్..

నిజామాబాద్, ఆంధ్రప్రభ : బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఇందూర్‌ మేయర్ పీఠం మాదేనని మెదక్ ఎంపీ రఘునందన్ అన్నారు. నిజామాబాద్ పేరుని ఇందూర్‌గా మార్చి తీరుతామని రఘునందన్ చెప్పారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తా, హనుమాన్ జంక్షన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని ఎదుర్కొనేందుకు ఎంఐఎం, కాంగ్రెస్ లు చేతులు కలిపాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ది మూడో స్థానం అని అన్నారు. కేసీఆర్ తన కూతురు కవితను అడ్డదారిలో ఎమ్మెల్సీ చేశారనీ విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం.. పసుపు బోర్డు సాధించిన ఘనత అరవింద్ ది అని, మెదక్ ఎంపీ అన్నారు.

కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో మోడీ కల అని అన్నారు. ఇందూరు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. బీజేపీ అభ్యర్థులను గెలిపించి ఇందూరు గడ్డ పై కాషాయం జెండా ఎగురవేయాలని నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు బీజేపీ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply