Janasena Jayakethanam | పుష్కరోత్సవంలో ప‌వ‌న్ గర్జన..

పిఠాపురం : చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ గర్జించారు. ఓటమి భయం లేదుకాబట్టే.. ఓడినా అగుడు ముందుకు వేశాం. మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. అని ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచి.. మొత్తం దేశం మ‌న‌ వైపు చూసేలా చేసాం అని అన్నారు.

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్ర‌సంగిస్తూ.. గుండె ధైర్యమే కవచంగా ధరించి అన్నీ ఒక్కడినై.. 2014లో జనసేన పార్టీ స్థాపించాను. 2018లో పోరాట యాత్ర చేశాం. 2019లో మనం ఓడినప్పుడు మీసాలు మేలేశారు, జబ్బలు చ‌రిచారు. మన ఆడపడుచులను అవమానించారు. ఇదేమి న్యాయం అని గొంతెత్తిన‌ మన జనసైనికులు, వీర మహిళలపై కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమంగా జైలులో బంధించారు. ఇక నాపై చేయని కుట్ర లేదు, తిట్టని తిట్టు లేదు, వేయని నిందలు లేవు.

ఈ ఎన్నికలో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేశారు. వారికి బుద్ధి వచ్చేలా ఆ గేట్లను బద్దలు కొట్టాం. మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకోవడమే కాకుండా.. 40 ఏళ్ల టీడీపీని కూడా నిలబెట్టాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలతో అడుగు పెట్టాం. దేశాం మొత్తం మ‌నవైపు చూసేలా 100 శాతం స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన విజయాన్ని సాధించాం, ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగురవేస్తున్నాం.

దాశరథి సాహిత్య చ‌దివి ప్రభావితుడయ్యానని అన్నారు. “రుద్రవీణను వాయిస్తాను.. అగ్ని ధారలను కురిపిస్తాను” అనే మాటల సత్యాన్ని మనం నిరూపించాము. దాష్టీక ప్రభుత్వాన్ని దించి, కూట‌మి ప్రభుత్వాన్ని గెలిపించారు.

Leave a Reply