వైద్యాధికారి నిర్లక్ష్యమే కారణం..

  • బాధితుల ఆరోపణ
  • ఆసుపత్రి ఎదుట ఆందోళన

ఉరవకొండ టౌన్, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన కేటి, రాజేష్ కుమారుడు ఆహారన్ (5) అనే చిన్నారి వైద్యాధికారి నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

వివరాలి ఇలా ఉన్నాయి….

జ్వరంతో బాధపడుతున్న బాలుడిని గత రాత్రి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు, విధుల్లో ఉన్న వైద్యుడు కనీసం వచ్చి చూడలేదని ఆరోపించారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శవంతో ఆందోళన చేపట్టారు.

వైద్యాధికారిణి వెంటనే సస్పెండ్ చేయాలని మృతి చెందిన బాలుడు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జనం డిమాండు చేశారు.

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారులు సరిగా విధులు నిర్వహించడం లేదని ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపించారు.

చిన్నపిల్లల పట్ల వైద్యాధికారి ఎందుకు నిర్లక్ష్యం చేశాడు, ఆసుపత్రికి వచ్చిన వారిని వైద్య పరీక్షలు చేస్తామన్న జ్ఞానం ఎందుకు రాలేదని పలువురి విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఈ అధికారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply