- కాశీబుగ్గ ప్రమాద స్థలిలో ఎమ్మెల్యే గౌతు శిరీష కంట
పలాస, ఆంధ్రప్రభ : కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 10 మంది చనిపోయిన సంఘటన స్థానిక శాసనసభ్యురాలు గౌతు శిరీషను తీవ్రంగా కలచివేసింది. సంఘటన సమాచారం తెలుసుకున్న ఆమె వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతం లోనే 7గురు మహిళలు మరణించడం చూసి ఆమె షాక్ అయ్యారు. మృతదేహాలను చూసిన ఆమె ఒక్కసారిగా భోరున విలపించారు. అసమయంలో అక్కడకు వచ్చిన వారు ఆమె ఎమ్మెల్యే అని తీయలేదు. చనిపోయినవారి బంధువేమో అని కొందరు అనుకున్నారు. తరువాత ఆమె ఎమ్మెల్యే అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.


