సీఎం, ఎక్సైజ్ మంత్రికి తమ్మినేని అల్టిమేటం జారీ

(ఆంధ్రప్రభ, ఇచ్ఛాపురం) : సీఎం, ఎక్సైజ్ మంత్రి రాజీనామా చేయాలని మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నకిలీ , కల్తీ మద్యం పట్టుబడి నందున వారిద్దరూ బాధ్యత వహించాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయం నుండి ఎక్సైజ్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లారు. ఓ దశ వారిని పోలీసులు అడ్డుకుని నినాదాలు చేయడాన్ని అడ్డుకున్నారు . అనంతరం ఎక్సైజ్ సిఐ దుర్గాప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు. పర్మిట్ రూమ్ లు వెంటనే రద్దు చేయాలని, బెల్టు షాపులు అరికట్టాలని , కల్తీ మద్యం పై సీబీఐ విచారణ (CBI inquiry) కు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉలాల భారతీదివ్య, సీనియర్ నాయకులు నర్తు నరేంద్ర, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ లాభాల స్వర్ణ మణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply