శ్రీరామనవమి వేడుకల్లో మారెడ్డి దంపతులు..

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం గ్రామంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారెడ్డి కొండల్ రెడ్డి దంపతులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి కృపతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
